అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన తప్పును భయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే..!

Friday, June 14th, 2019, 01:02:48 PM IST

ఏపీలో రెండు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిన్న రెండో రోజు సమావేశంలో చర్చలు మాత్రం తార స్థాయికి చేరుకున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండూ పెద్ద ఎత్తున విమర్శలు కుప్పించుకున్నాయి. మీరు తప్పు చేసారు అని ఒకరు అంటుంటే, మీరు కూడా తప్పు చేసారు అంటూ మరొకరు తమ వాదనలను చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యవూల కేశవ్ అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను ప్రశంసించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉండి, పార్టీ కార్యక్రమాలలో సుధీర్ఘ అనుభవం ఉన్న మీలాంటి నేత అత్యున్నత స్థానమైనటువంటి స్పీకర్ పదవిలో కూర్చున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాంటి స్థానంలో మీరు ఏకపక్షంగా వ్యవహరించకుండా అధికార, ప్రతిపక్ష పార్టీ వాదనలను విని తీర్పును ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్న విషయాలు చాలా అమాయకంగా ఉంటున్నాయంటూ ఎద్దెవా చేశారు. తాను విలువలను కాపాడుతున్నానని నేను మీలా ఎమ్మెల్యేలను కొని పార్టీలో చేర్చుకోదల్చుకోలేదని, నేను అదే చేస్తే మీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ మాట్లాడని మాట్లాడుతున్నారు. మా పార్టీ నాయకులను బంట్రోతులు అంటూ వ్యాఖ్యనించడం తప్పు కానప్పుడు మా నాయకుడు చంద్రబాబు మీ ఆహ్వానానికి రాకపోవడం కూడా తప్పు కాదు అంటూ మాట్లాడారు.

అయితే విలువలను కాపాడుతా, తప్పు చేయను అని చెబుతున్న ఇదే ముఖ్యమంత్రి 2014 లో శాసనసభ సభలో స్పీకర్ ఎంపిక సమావేశంలో మాట్లాడుతూ పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వ్యక్థి. గతంలో మంత్రిగా కూడా ఈయన పనిచేసారు. అలాంటి అనుభవం ఉన్న ఆయనను స్పీకర్‌గా ప్రపోజ్ చేయాలంటూ ఎనుమల రామక్రిష్ణుడు గారు వచ్చి ప్రపోజ్ చేస్తున్నాము, ప్రపోజల్‌కి మీ మద్దతు కావాలని అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా హెజిటేషన్ అనేది లేకుండా మా పార్టీ తరుపున మీకు పూర్తి సహకారం తెలియచేస్తున్నామని చెప్పిన జగన్ మాటలను ఒక్కసారి గుర్తు చేశారు. అలాంటిది ఈ సభలో కనీసం మిమ్మల్ని స్పీకర్‌గా ప్రతిపాదిస్తున్నామని, దానికోసం ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విలువలను కాపుడుతున్న జగన్‌కే అది సాధ్యం అంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన తప్పును ఎత్తి చూపారు.