జూపూడి ప్రభాకర్ వైసీపీ చేరికపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, October 8th, 2019, 07:40:13 PM IST

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయనే చెప్పాలి. మునుపెన్నడు లేని విధంగా టీడీపీ ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీలలోకి వలసలు కట్టారు. అయితే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి ఇప్పటికే వైసీపీ, బీజేపీలో చేరిపోయారు. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే జూపూడి టీడీపీనీ వీడి వైసీపీలో చేరడంతో కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజవేయస్వామి ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు.

అయితే అధికారం కోసం ఆశపడే జూపూడి పార్టీ మారారని, అధికారం ఏ పార్టీలో ఉంటే జూపూడి ఆ పార్టీలో ఉంటారని తేలిపోయిందని, దళిత పులిని అని చెప్పి దళితులను మోసం చేసి నేడు ఆయన వైసీపీలో చేరారని అన్నారు. జగన్‌పై ఒకప్పుడు తీవ్ర విమర్శలు చేసి, అవినీతిపరుడు అంటూ చెప్పుకొచ్చిన జూపూడి ఇప్పుడు ఆ అవినీతి చెంతకే చేరారని జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనని, ఊసరవెల్లిలా మారడం జూపూడికే సాధ్యమని అన్నారు.