బిగ్ బ్రేకింగ్: టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరబోతున్నారా.. షాక్‌లో టీడీపీ..!

Friday, June 14th, 2019, 09:19:39 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అంతేకాదు తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలతో కూడా శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే సీఎం జగన్ ఇప్పటికే తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో మార్పులు తీసుకువస్తున్నారు.

అంతేకాదు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి సీఎం జగన్ ముచ్చేమటలు పట్టిస్తునారు. గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్ట సభలను నిర్వీర్యం చేస్తూ వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని ఇప్పుడు అదే 23 ఎమ్మెల్యేలను గెలుచుకున్నారంటూ అవినీతి, అక్రమాలకుపోతే ఆ దేవుడు సరైన శిక్ష వేశాడని అన్నారు. నేను ఒకే చెబితే మీ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారని అప్పుడు టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చానీయాంశంగా మారింది. అంతేకాదు టీడీపీలోని కొంత మంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట. అదే కనుక జరిగితే టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయం, ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోతుంది. అయితే వీరంతా టీడీపీని వీడి వైసీపీలో చేరాలంటే జగన్ చెప్పినట్టు తమ పార్టీకి, పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆ టీడీపీ ఎమ్మెల్యేలంతా రెడీ అయిపోయినట్టు ఇక వైసీపీ అధినేత జగన్ ఒకే చెప్పడమే ఆలస్యమట. అదే జరిగితే ఏపీలో వీరు పోటీ చేసిన స్థానాలలో మళ్లీ ఉప ఎన్నికలు రావడం ఖాయం.