వైకాపా దాడుల‌కు బుద్ధా ఎదురు దాడి!!

Thursday, June 13th, 2019, 11:10:49 PM IST

జ‌గ‌న్ సీఎం అయ్యాక అసెంబ్లీలో వైకాపా నాయ‌కుల హ‌ల్ చ‌ల్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వీలున్న‌ప్పుడ‌ల్లా తేదేపా అవినీతిని ఎండ‌గ‌డుతూ .. కోడెల‌ను టార్గెట్ చేస్తూ ఓ ఆటాడుతున్నారు. పోల‌వ‌రం అవినీతిపైనా దంపుడు వేసేయడం క‌నిపిస్తోంది. అయితే దీనిపై చంద్ర‌బాబు ప్ర‌తి ఎటాక్ స్టార్ట్ చేశారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో ఆయ‌న స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఇక వేరొక మీడియా స‌మావేశంలో బుద్ధా వెంక‌న్న సైతం ఇలానే వైకాపాపై విరుచుక‌ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తేదేపా పైనా.. చంద్ర‌బాబు పైనా వైకాపా నేత‌లు ఇష్టానుసారం మాట్లాడ‌డం స‌రికాద‌ని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ లు చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరి కాద‌ని .. ఎన్నికల సమయంలో వైకాపా నాయ‌కులు నోటికొచ్చినట్లు మాట్లాడార‌ని ఎదురు దాడికి దిగారు. అమరావతి లో మంత్రులు, శాసన సభ్యులు , అధికారుల కోసం అధునిక వసతులతో ఛాంబర్ లు కట్టించారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన మీరు చంద్రబాబు కట్టించిన భవనాల నుంచే పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు ప్రతి పక్ష నేతగా ఉన్నారు, వయసు కైనా గౌరవం ఇస్తే బాగుంటుంది. గజనీ, మైండ్ పోయింది అంటూ చంద్రబాబు పై వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామ‌ని అన్నారు.

ప్రజలు మీకు అధికారాన్ని అప్పచెప్పారు.. కొంత సమయం ఇవ్వాలనే మేం కూడా వేచి చూస్తున్నామ‌ని ..చంద్రబాబు పై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేద‌ని హుకుం జారీ చేశారు బుద్ధా. పోలవరం గురించి కనీసం సమీక్ష చేయకుండా టిడిపి ప్రభుత్వం పని తీరును ఎలా తప్పుబడతార‌ని అన్నారు. టిడిపి ప్రవేశ పెట్టిన పధకాలను తొలగించినా మేం మాట్లాడలేదు. మీ పని తీరు చూసేందుకు కొంత సమయం వేచి ఉండాలని భావిస్తున్నామ‌ని అన్నారు. మీరు అనవసరంగా నోరు పారేసుకుంటే… మేము కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతాం. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది గుర్తు ఉంచుకుంటే మంచిది. స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనా ప్రతిపక్ష సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం సంప్రదాయం. సంఖ్యా బలం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించి చంద్రబాబు ను తప్పు బడితే ఎలా అని బుద్ధా మీడియా ముఖంగా ప్ర‌శ్నించారు. రాజకీయాలలో గెలుపోటములు సహజం,..‌ కానీ ఎవరి మర్యాదను వారు కాపాడుకుంటే మంచిది.ఇప్పటికైనా చంద్రబాబు ఐ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని వైసిపి సభ్యులను కోరుతున్నామ‌ని అన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యే లు వైసిపి లోకి వస్తే రాజీనామా‌ చేసి రావాలని జగన్ చెప్పడాన్ని నేను స్వాగతిస్తున్నామ‌ని బుద్ధా అన్నారు. మొత్తానికి తేదేపా త‌ర‌పున బుద్ధా ఎదురుదాడికి దిగార‌న్న‌మాట‌!