ఆ ఎంపీ, ఎమ్మెల్సీల వివాదం చంద్రబాబుకు నిజంగా పెద్ద సవాల్..!

Thursday, July 11th, 2019, 11:35:13 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక ఇప్పుడిప్పుడే టీడీపీ తిరిగి కోలుకునే అవకాశాలు కూడా కనిపించడంలేదు.

అయితే ఇక టీడీపీలో ఉంటే తమ రాజకీయ జీవితం ఇంతటితోనే ముగిసిపోతుందని భావిస్తున్న కొందరు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు సన్నిహితులైన నలుగురు రాజ్యసభ ఎంపీలు, మరికొంత మంది నేతలు టీడీపీ పార్టీనీ వీడి బీజేపీలో చేరిపోయారు. మరికొందరు నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరుతున్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు పీక మెడలకు చుట్తుకున్నతువంటి ఈ వలసలను ఆపడానికి ప్రయత్నిస్తుంటే టీడీపీ నేతల మధ్య జరుగుతున్న మరో వివాదం చంద్రబాబు ముందుకొచ్చింది. అయితే గుంటూర్ జిల్లా ఎంపీగా గెలిచిన గల్లాజయదేవ్, ఎమ్మెల్సీ, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చానీయంశంగా మారింది. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎంపీ గల్లా తన విజయానికి సహకరించలేదని ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో పర్యటించిన గల్లా తల్లి గల్లా అరుణ కూడా ఎమ్మెల్యేకి ఎవరికి ఓటు వేసినా, ఎంపీ ఓతు మాత్రం టీడీపీకే వేయాలంటూ కోరిందని దీనిపై డొక్కా మరియు తన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే గల్లా కుటుంబం మాత్రం ఎన్నికలలో మేము బాగానే సహకరించామని, డొక్కా వర్గీయులే తమకు సహకరించలేదని అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. అయితే ప్రస్తుతం గుంటూర్ జిల్లాలో వీరిద్దరి మధ్యన పెద్ద ఎత్తున విబేధాలు కనిపిస్తుండడంతో ఈ విబేధాలు ఇప్పుడు అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే వీరిద్దరి మధ్య తలెత్తిన విబేధాలకు ఎలాగైనా పుల్‌స్టాప్ పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలలో చర్చ జరుగుతుంది.