బ్రేకింగ్: కోర్ట్ తీర్పునిస్తే ఎంపీ గల్లా ఓటమి ఖాయమా..!

Tuesday, July 2nd, 2019, 10:18:19 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే ఇక లోక్‌సభ విషయానికి వస్తే మొత్తం 25 స్థానాలలో 22 స్థానాలను వైసీపీ గెలుచుకోగా, కేవలం 3 స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది.

అయితే టీడీపీలో గెలిచిన ముగ్గురు ఎంపీలు కింజరపు రాం మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని. అయితే వీరు ముగ్గురు 2014లో కూడా ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం గల్లా గెలుపు అయోమయంగా మారింది. ఈయన ఈ ఎన్నికలలో అతి తక్కువ ఓట్లతో గెలిచారు. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కబెట్టకుండా వదిలేయడం వల్లనే గల్లా గెలుపు సాధ్యమైందని దానిపై వైసీపీ ఎంపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కోర్ట్‌కి వెళ్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తమ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ 9,782 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కింపు జరపలేదని ఎన్నికల కమీషన్‌ని సవాల్ చేస్తూ సవాల్‌ చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పిటీషన్‌ని పరిశీలించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే ఈ ఓట్లను కనుక లెక్కించాలని కోర్ట్ ఆదేశిస్తే గల్లా ఓటమి ఖాయమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సారి వైసీపీకి ఓటు వేయడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న మూడూ ఎంపీ సీట్లలో కూడా ఒకటి ఇలా ఇరకాటనా పడడంతో టీడీపీ నేతలలో కాస్త టెన్షన్ మొదలైంది.