భారత్-ఆసీస్ మ్యాచ్ లో టీడీపీ ఎంపీ!

Sunday, June 9th, 2019, 08:01:42 PM IST

ఈరోజు కెనింగ్టన్ వేదికగా లండన్ లో భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అక్కడనున్న భారతీయులతో పాటుగా చాలా మంది ప్రముఖులు కూడా వెళ్లారు.వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి మహేష్ బాబు కూడా తన కుటుంబంతో కలిసి వీక్షించేందుకు వెళ్లగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా రెండో సారి ఎంపీగా గెలుపొందిన రామ్మోహన్ నాయుడు తన భార్యతో సందడి చేసారు.వీరిద్దరూ మ్యాచ్ ను తిలకించేందుకు వెళ్లి తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పి తమ ఆనందాన్ని వారి అభిమానులతో పంచుకున్నారు.