నీకున్న తెలివి తేటలు దేశంలో ఎవరికీ లేవు జగనన్నా—టీడీపీ ఎంపీ!

Friday, January 24th, 2020, 05:36:22 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పైన, చేస్తున్న వ్యాఖ్యల పైన టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. శాసన మండలి రద్దు గురించి ఈ సోమవారం అసెంబ్లీ లో చర్చ జరగనుంది. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ మరియు పరిపాలన వికేంద్రీకరణ విషయం లో ముఖ్యమంత్రి జగన్ ఆమోదించిన బిల్లులను సెలెక్ట్ కమిటీ కి పంపి అందరికి షాకిచ్చారు మండలి చైర్మన్ షరీఫ్. అయితే ఈ విషయం ఫై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపానని షరీఫ్ పేర్కొనడం కొసమెరుపు.

అయితే మండలిలో జరిగిన పరిణామాలు వైసీపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసిన చర్యలు కావడం తో ముఖ్యమంత్రి జగన్ శాసన మండలిని సోమవారం అసెంబ్లీ లో రద్దు చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ వార్తల నేపథ్యం లో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ ఫై సెటైర్లు వేశారు. నీకున్న తెలివి దేశంలో ఎవరికీ లేవు జగన్ అన్నా, ఉండి ఉంటె రాజ్యసభతో కూడా పనిలేదు రద్దు చేయమనే వారు అంటూ విమర్శలు గుప్పించారు.