జగన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం..కేశినేని సంచలన ట్వీట్.!

Sunday, August 9th, 2020, 12:35:21 PM IST

ఇటీవలే ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో ప్రయివేట్ కరోనా ఆసుపత్రిలో ఊహించని విధమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకునేసరికి ఒక్కసారిగా మరోసారి దేశ రాజకీయాలు మొత్తం విష్మయానికి లోనయ్యాయి. ఏకంగా దేశ ప్రధాని మాత్రమే కాకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా తెలుగులో ట్వీట్ చేసి మరీ తన స్పందనను తెలిపారు. అయితే ఈ ఘోరమైన ఘటనకు మాత్రం ప్రధాన బాధ్యులు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగనే అని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన ట్వీట్ పెట్టారు.

“ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ పరిస్థితి. గవర్నమెంట్ ఆసుపత్రులలో సరైన సదపాయాలు లేక పోవడం ప్రైవేటు ఆసుపత్రుల మీద నియంత్రణ లోపించడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగతున్నాయి.” అన్ని తన స్పందనను తెలిపారు. అయితే ఈయన చెప్పిన దానిలో కూడా పాయింట్ లేకపోలేదని చెప్పాలి. ఎందుకంటే ఏపీలోని వైద్యంపై నమ్మకం లేకనే కదా వైసీపీ నేతలు అంతా ఇతర రాష్ట్రాలకు పరుగులు తీసింది. మరి అలాంటప్పుడు కేశినేని చేసిన ఈ ట్వీట్ లో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి.