టీడీపీ ఎంపీ కేశినేని నాని కి కరోనా వైరస్ పాజిటివ్

Friday, April 16th, 2021, 01:22:47 PM IST

తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేత, ఎంపీ కేశినేని నాని కి కరోనా వైరస్ సోకింది. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా, కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా వైరస్ సోకడం పట్ల ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.అయితే చాలా స్వల్పంగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయి అని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి అంటూ విజ్ఞప్తి చేశారు కేశినేని నాని.అయితే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అని అన్నారు.