ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ..టీడీపీ ఎంపీ వినూత్న పోస్ట్!

Tuesday, June 11th, 2019, 05:57:21 PM IST

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం కూడా ఎక్కువ ఆదరణ పొందే సరికి రాజకీయ నాయయకులు కూడా దీన్ని గట్టిగానే వాడేస్తున్నారు.ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకు చెందినటువంటి ముగ్గురు ఎంపీ లలో శ్రీకాకుళంకు చెందినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గతంలో పార్లమెంట్ సభలో ఏపీ కోసం తన గళాన్ని ఏ స్థాయిలో వినిపించారో చూసాము.అలాగే ఈసారి మళ్ళీ ఎన్నికల అనంతరం జూన్ 17న మొదలు కాబోతున్న మొట్ట మొదటి పార్లమెంటు సమావేశంలో తాను ఏం మాట్లాడాలో మీరే చెప్పండి అంటూ ఏపీ ప్రజలకు తన నిర్ణయాన్ని విడిచి పెడుతూ తన పేస్ బుక్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.

“లోక్ సభ మొదటి సమావేశం జూన్ 17న మొదలవుతుంది. పార్లమెంటులో నేను ఏ విధమైన సమస్యల గురించి మాట్లాడాలి? మన ప్రభుత్వానికి ఏదైనా విషయం మీద ప్రత్యేకంగా మన గళం వినిపించాలి అనుకుంటున్నారా? మీ ప్రశ్నలను లేదా స్పందనలను హాష్ ట్యాగ్ #AskRam లేదా #RamSpeaks తో పోస్ట్ చేయండి.#PeopleFirst #PoliticsNext” అని తెలిపారు.నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాన్ని సేకరించి వారు గొంతును తన గొంతుగా పార్లమెంటులో వినిపించాలి అని అనుకోవడం ఇది నిజంగా ఒక హర్షణీయమైన అడుగే అని చెప్పాలి.