జగన్ ను జైలులో పెడతారనే భయంతోనే…సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్మోహన్ నాయుడు

Friday, April 9th, 2021, 01:46:23 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార పార్టీ వైసీపీ పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై, వైసీపీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యల పై వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఏనాడైనా గట్టిగా మాట్లాడారా అంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ ను జైలు లో పెడతారనే భయంతోనే వైసీపీ ఎంపీలు మాట్లాడలేక పోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేసుల నుండి ఎలా బయట పడాలి అన్నదే సీఎం జగన్ ఆలోచన అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో నే తిరుపతి లో అభివృద్ది జరిగింది అని, వైసీపీ అధికారం లోకి వచ్చాక ఒక్క అభివృద్ది కార్యక్రమం అయినా చేపట్టారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో టీడీపీ అభ్యర్థి కి ఓటేసి గెలిపించాలని రామ్మోహన్ నాయుడు కోరారు.

అయితే అటు వైసీపీ నేతలు చేస్తున్న వరుస విమర్శలకు ఇటు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మరొకసారి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అధికార పార్టీ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.