బిగ్ బ్రేకింగ్: సమస్యల పరిష్కారానికి టీడీపీ ఎంపీ సంచలన నిర్ణయం..!

Monday, June 10th, 2019, 12:45:44 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితమే సీఎం జగన్ తన కేబినెట్‌ను కూడా ప్రకటించేసి ప్రమాణస్వీకారం కూడా చేయించేశాడు. అయితే నేడు తొలిసారిగా మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. అంతేకాదు పలు ముఖ్యమైన అంశాలపై సీఎం జగన్ మంత్రివర్గంతో చర్చలు కూడా జరిపారట.

అయితే ఈ ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. మొత్తం మీదుగా 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న టీడీపీ, కేవలం మూడు మాత్రమే లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే శ్రీకాకులం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రామ్ మోహన్ నాయుడు మరోసారి టీడీపీ తరుపున ఎంపీగా గెలిచారు. రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచినా ఇక్కడ మాత్రం రామ్ మోహన్ నాయుడును ఓడించలేకపోయింది వైసీపీ. అయితే యువనాయకుడిగా, ప్రజల సమస్యలను తీరుస్తూ పార్లమెంట్‌లో గొంతు విప్పి రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్న రామ్ మోహన్ నాయుడుకే ఇక్కడి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. అయితే శ్రీకాకులం ప్రజలకు వీరి కుటుంబం పైన కూడా ముందునుంచి కాస్త అభిమానం ఎక్కువే. ఆ అభిమానాన్ని కూడా వీరు ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా ఎంపీ రామ్ మోహన్ నాయుడు తన ట్విట్టర్ ద్వారా ప్రధాన సమస్యలు, ప్రజల డిమాండ్లు తెలుసుకునే విధంగా ఒక ట్వీట్ పెట్టారు. ఈ నెల 17న తొలి లోక్‌సభ సమావేశాలు ఉన్నందున పార్లమెంట్‌లో ముందుగా ఏఏ సమస్యల గురించి పోరాడాలి, ఏఏ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి అనే వాటిని మీ తరుపున కూడా నాకు కొన్ని తెలియపరచాలంటూ తన అభిమానులకు, ప్రజలకు మరియు స్నేహితులకు కామెంట్స్ రూపంలో సమస్యలు చెప్పమని పోస్ట్ చేశాడు. ఇంకేముంది చాలా మంది మనోడి పోస్ట్‌కు అన్నా అది అడగండి, ఇది అడగండి, దీనిపై ప్రశ్నించండి అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియాపరంగా కూడా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడుతానని చెప్పిన ఎంపీ రామ్ మోహన్ నాయుడుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారట.