మరోసారి పవన్ తో దోస్తీ..?ఏమవుతుందో..?

Tuesday, December 10th, 2019, 08:09:29 AM IST

ఇప్పుడు ఏపీలోని ఉన్న మూడు ప్రధాన పార్టీలలో ఒకటి అధికారంలో ఉంది కావున మిగతా రెండు పార్టీలకు కూడా కామన్ గానే టార్గెట్ అయ్యిపోయింది.దీనితో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు మరోసారి దోస్తీ కడతాయా అన్న అనుమానాలు ఇప్పుడే మెల్లగా మరోసారో జనాల్లో పెరిగిపోతున్నాయి.అయితే టీడీపీతో జత కట్టే అవసరం జనసేనకు లేదు కానీ తెలుగుదేశం పార్టీకు మాత్రం మరోసారి జనసేన పార్టీతో దోస్తీ కట్టే అవసరం మాత్రం కల్పించుకుంటున్నారు.ఈ అనుమానాలు ఇప్పుడు మరోసారి ఎందుకు రేకెత్తుతున్నాయి.

ఎందుకు అంటే తాజాగా పవన్ ఏవైతే అంశాలను రాష్ట్రంలో లేవనెత్తుతున్నాడో అవే అంశాలను తెలుగుదేశం పార్టీ వారు కూడా మెల్లగా లేవనెత్తి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది.నిన్న జనసేన అధినేత పవన్ రాష్ట్రంలో ప్రజలు ఉల్లి కోసం పడుతున్న కష్టాలను చూసి జగన్ నియమించిన వాలంటీర్లను ఇందుకు వినియోగించి ఒక్కొక్కరి ఇంటికి ఉల్లిపాయలు చేరవేయ్యొచ్చు కదాని సూచించారు.మళ్ళీ ఇదే పాయింట్ ను నారా లోకేష్ కూడ తర్వాత లేవనెత్తాడు.అలాగే ఇదొక్కటే కాకుండా చాలా అంశాలనుఁ టీడీపీ వారు పవన్ మాట్లాడిన తర్వాతే మాట్లాడుతున్నారు.ఇవన్నీ చూస్తుంటే నిజంగానే టీడీపీ మరోసారి పవన్ ను దువ్వే ప్రయత్నం మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది.మరి పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.