వైసీపీపై కుట్ర చేద్దామనుకుని అడ్డంగా బుక్కైన టీడీపీ.!

Sunday, August 25th, 2019, 07:47:04 PM IST

వైసీపీ పార్టీ అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కృష్ణా నదీ జలాలతో రాజధాని ప్రాంతంలోని అనేక ప్రాంతాలు పల్లెలు ముంపుకు గురయ్యిపోయాయి.ఇక అయ్యిందేదో అయ్యిపోయింది.ప్రజలు ఇక్కట్లు పడడం తప్పలేదు.దీన్ని తమ రాజకీయాల కోసం చాలా దారుణంగా వాడుకుందామన్న స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి.

ఎందుకంటే అధికార పార్టీపై బురద జల్లడానికి ఈ ఘటనను వాడుకునే ప్రయత్నం చేసారు.అందులో భాగంగానే ముంపు ప్రాంతాల్లో ఉండే స్థానికుల్లా కొంతమంది పైడ్ ఆర్టిస్టులను పెట్టి వీరే వీడియోలు చిత్రీకరించి తమ సోషల్ మీడియా విభాగాల ద్వారా ప్రచారం చేసారు.ఈ వీడియోలను చినబాబు లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా షేర్ చేసుకున్నారు.ఈ వీడియోను కానీ మొట్టమొదటి సారి చూస్తే నిజంగానే స్థానికులు ఇలా వీడియో పెట్టారా అన్న రేంజ్ లో వీరు ప్లాన్ చేసి సృష్టించారు.

దీనితో వైసీపీ రంగంలోకి దిగి అసలు ఈ వీడియో ఉన్న వ్యక్తి ఆ గ్రామలకు చెందిన వాడు కాదని సాక్ష్యాలతో నిరూపించారు.దీనితో ఆ పైడ్ ఆర్టిస్ట్ మీద వైసీపీ అభిమానులు కేసు పెట్టగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.అతనితో పాటు మరో ముగ్గుర్ని అలాగే అసలు ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు ఎవరు చెప్తే ఇదంతా చేసారు అన్న కోణాల్లో వారిని ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి మాత్రం వైసీపీపై కుట్ర చేద్దామని టీడీపీ అడ్డంగా బుక్కయ్యారని చెప్పాలి.