ఈ విషయంలో టీడీపీ మరింత డ్రామా చేస్తుందా..?

Tuesday, September 10th, 2019, 05:45:22 PM IST

గత కొన్ని రోజుల క్రితమే కృష్ణా నదీ జలాల ఉదృతి దెబ్బకు రాజధాని పరిసర ప్రాంతాలు చాలా నీటి మట్టం అయ్యిపోయాయి.అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఇలాంటి ఘోరం జరిగిందని ఈ నిర్ణయం వల్లనే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ అధిష్టానం వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది.సరే ఇదంతా బాగున్నా వీరు ఇంకొక అడుగు ముందుకేసి వైసీపీను ఎలా అయినా సరే ఏపీ ప్రజల్లో చెడుగా చిత్రీకరించాలని కొంత మంది పైడ్ ఆర్టిస్టులను పెట్టి వారు ముంపు ప్రాంతాలకు చెందిన రైతులుగా బిల్డప్ ఇచ్చి దొరికేసారు.

ఇదిలా ఉండగా ఈసారి మరింత డ్రామా ప్లే చేస్తున్నారని వైసీపీ అభిమానులు అంటున్నారు.మనకి తెలుగుదేశం మరియు చంద్రబాబుకు అనుకూలంగా కొన్ని మీడియా చానెళ్లు పని చేస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు వారు ఏకంగా వైసీపీ బాధితులు అని చెప్పి ఏకంగా రైతుల దగ్గరే ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు.ఇది మాత్రం కాస్త ఓవర్ అనే చెప్పాలి,దీనితో వీరు కూడా పైడ్ ఆర్టిస్టులే అని వైసీపీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది నిజమో కాదో వారు నిజమైన రైతులో కాదో కానీ కేవలం ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీను సాఫ్ట్ కార్నర్ లో చూపిస్తున్నారు తప్ప.