వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరాచకాలను బయటపెట్టిన టీడీపీ.!

Tuesday, August 13th, 2019, 11:52:36 AM IST

వైసీపీ పార్టీకు చెందినటువంటి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం రేపిన సంగతి అందరికి తెలిసిందే.జమీన్ రైతు వార పత్రిక వ్యవస్థాపకుడు అయినటువంటి డోలేంద్ర ప్రసాద్ పై అతని అనుచరులతో వెళ్లి భయాందోళనలకు గురి చేసి వారిని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి.దీనితో ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన అక్రమాలు దౌర్జన్యాలు ఇలా అతనికి సంబంధించిన అరాచకాల చిట్టా అంటూ ఒక వీడియోనే అధికారంగా వారి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.వైసీపీ ఎమ్మెల్యే అంటే గూండాగిరికి లైసెన్స్ ఉన్నట్టేనా?నీ తోలు తీస్తా కావాలంటే రికార్డు చేస్కో సోషల్ మీడియాలో పెట్టుకో అంటూ వాయిస్ ఓవర్ తో ఈ వీడియో ఉంది.కోటంరెడ్డి విషయంలో ఇది వరకే చాలానే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి మరి జగన్ వీటిపై ఎలాంటి స్పందన అయినా ఇస్తారో లేదో చూడాలి.