నేటి నుండి టీడీపీ ప్రజా చైతన్య యాత్ర షురూ…

Wednesday, February 19th, 2020, 02:05:15 AM IST

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండే వైసీపీ పార్టీ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలను సాగిస్తుందని, ప్రతిపక్ష నాయకులపై, కార్యకర్తలపై దాడులు జరిపిస్తూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వపు నియంతృత్వ పోకడలనుండి ప్రజలందరినీ రక్షించి, వారికి అండగా మేము ఉన్నామని చెప్పి, వారికి ఒకరకమైన భరోసా కల్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా బుధవారం నుండి ప్రకాశం జిల్లా బొప్పూడి నుండి ప్రజాచైతన్యయాత్ర ప్రారంభిస్తున్నామని అధికారికంగా వెల్లడించారు.

అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ అసమర్థంగా పాలన పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వాటి వలన రాష్ట్రంలో జరుగుతున్న నష్టాలను అన్నింటిని ప్రజలకు వివరించనున్నామని తెలిపారు. ఇకపోతే బుధవారం ఉదయం 11 గంటలకు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం, మార్టూరు మండలం బొప్పూడి నుంచి యాత్ర ప్రారంభం కాగా, అక్కడినుండి వివిధ ప్రాంతాలకు చేరుకొని, చుట్టూ పక్కన గ్రామాల్లోని ప్రజలందరితో మాట్లాడి, వారి సమస్యలపై చర్చించనున్నారని సమాచారం.