ఏపీ లో ఎప్పటికీ టీడీపీ రాజ్యమే ఉండాలి .. శాశ్వతంగా – చంద్రబాబు

Sunday, November 6th, 2016, 11:11:43 AM IST

chandrababu
టీడీపీ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో శాశ్వతంగా ఎప్పటికీ అధికారం లోనే ఉంచాలి అని కోరుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ప్రతీ తెలుగుదేశం కార్య కర్తా కృషి చెయ్యాలి అని చంద్రబాబు పిలుపుని ఇచ్చారు. కష్టపడే తత్వం ఉన్న ఒక్క కార్యకర్తకి కూడా అన్యాయం జరగకుండా తాను చూసుకుంటాను అని అంటున్నారు ఆయన. రాష్ట్రం లో ఎన్నికల్లో పోటీ పరంగా అవతల పక్షానికి డిపాజిట్ లు కూడా రాణి పరిస్థితి ఉండాలి అనీ ప్రజలకి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ సమస్య ని ఎమ్మెల్యే లేదా ఎంపీ ల దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అన్నారు బాబు. కార్యకర్తలు తెచ్చే సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రులకు ఆయన సూచించారు. తెలుగుదేశం ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉండిపోవాలని అన్నారు. పేదలైన కార్యకర్తలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారానూ, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారానూ సాయం చేస్తామని వివరించారు.