బిగ్ బ్రేకింగ్: టీడీపీ సీనియర్ నేత సంచలన నిర్ణయం.. షాక్‌లో టీడీపీ నేతలు..!

Friday, June 7th, 2019, 01:45:15 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఒక పక్క ఘోరంగా ఓటమిపాలైనా టీడీపీ పరిస్థితి రోజురోజుకు ఘోరంగా మారుంతుంది. అయితే తిరిగి పార్టీనీ నిలబెట్టి, కార్యకర్తలలో ఆత్మ విశ్వాసం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అయితే చంద్రబాబుకు ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఏ సమస్యా లేకపోయినా, సొంత పార్టీ నేతల నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. అయితే ఇక ఏపీలో టీడీపీ కోలుకోలేదని తెలిసిన నేతలంతా పార్టీ మారాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు గత రెండు రోజులుగా కేసినేని నాని పార్టీపై అసంతృప్తితో పార్టీ మారనున్నట్టు సమాచారం రావడం, అధినేత ఆయనకు విప్ పదవిని ఇస్తే దానికి సమర్ధుడిని కాదని ఆ పదవిని తిరస్కరించడంతో టీడీపీలో ఆ వార్తలౌ కలకలం రేపాయి. అయితే స్వయంగా చంద్రబాబే ఆయనను పిలిపించి బుజ్జగించారు. అయితే తాజాగా టీడీపీ మరో సీనియర్ నేత పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ నేత స్వయంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతుంది.

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీనీ వీడి టీడీపీలోకి చేరిన సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఇప్పుడు పార్టీనీ వీడి బీజేపీలో చేరాలని భావిస్తున్నారట. 2014 ఎన్నికలలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన రాయపాటి, ఈ సారి ఎన్నికలలో పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చేందుకు కాస్త వెనకా ముందాడినా చివరకు రాయపాటికే మళ్ళీ టికెట్ ఇచ్చింది. అయితే ఈ సారి వైసీపీ ప్రభంజనంలో గెలిచి నిలబడలేకపోయారు రాయపాటి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారే ఆలోచనలో రాయపాటి ఉన్నారని, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ అధినేత రాయపాటి కావడం తన కాంట్రాక్ట్ విషయంలో ఇక కేంద్రం నుంచి బీజేపీ మద్ధతు అవసరం ఉంటుందని భావించి టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నట్టు సోషల్ మీడియాలో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం రాయపాటి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాన్ని భయటపెట్టలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే చంద్రబాబుకు మరో గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.