కోవిడ్ చికిత్స పొందుతూ మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత

Sunday, May 2nd, 2021, 10:22:35 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే తాజాగా తెలుగు దేశం పార్టీ కి చెందిన సీనియర్ నేత, మాజి ఎమ్మెల్యేబొడ్డు భాస్కర రామారావు కోవిడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ మాజి చైర్మన్ బొడ్డు భాస్కర రామారావు విశాఖ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. 1982 లో సామర్లకోట సమితి అధ్యక్షుడు గా ఎన్నిక అయ్యారు, 1984 లో జడ్పీ చైర్మన్ గా తెలుగు దేశం పార్టీ తరపున సేవలు అందించారు. అయితే ఆయన 1994 మరియు 2004 లో పెద్దాపురం ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజాసేవ చేశారు. 2002 నుండి 2017 వరకు కూడా ఎమ్మెల్సీ గా ఉన్నారు. అయితే తెలుగు దేశం పార్టీ తరపున ప్రజా సేవ అందించిన ఈయన మృతి తో టీడీపీ కి చెందిన నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.