ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి!

Thursday, May 21st, 2020, 03:42:49 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన లో దూసుకుపోతున్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, ప్రజలకు కావల్సిన వనరుల పై న జగన్ దృష్టి సారించారు. అయితే కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం జగన్ జీవో 203 ను కూడా ప్రవేశ పెట్టారు. పోతిరెడ్డపాడు ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ అంశం పై తెలంగాణ రాష్ట్రంలో విమర్శలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు తో సహా, టిడిపి నేతలు దీని పై ఒక్క మాట కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు.

అయితే ఈ విషయం పై టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్త శుద్ది తో పని చేస్తున్నారు అని జెసి దివాకర్ రెడ్డి అన్నారు.టిడిపి నేతలు చేసే దీక్షలు వృధా అని వ్యాఖ్యానించారు. అయితే వారు దీక్షలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలీదు అని అన్నారు. రాయల సీమ ప్రాంతానికి ఎత్తి పోతల పథకం కింద జీఓ తెచ్చిన జగన్ కి అభినందనలు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో వై యస్ రాజ శేఖర్ రెడ్డి చాలా కృషి చేశారు అని అన్నారు.