మున్సిపల్ ఎన్నికలకు ముందు టీడీపీకి షాక్.. సీనియర్ నేత గుడ్‌బై..!

Tuesday, March 2nd, 2021, 05:09:46 PM IST

ఏపీలో విపక్ష టీడీపీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ పార్టీనీ మెల్లమెల్లగా కుదుటపడేసేందుకు ప్రయత్నిస్తున్నా, మరో వైపు వలసల పర్వం మాత్రం ఆగడం లేదు. తాజాగా టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు టీడీపీ నేత, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే 1995-2000 మధ్య ఈయన కర్నూలు మేయర్‌గా పనిచేశారు.

అయితే ప్రజా సమస్యలపై వివిధ వేషధారణలతో తన నిరసన వ్యక్తం చేస్తూ బంగి అనంతయ్య తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే కొద్ది రోజులుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండి అనంతయ్య తాజాగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు అనంతయ్య చెప్పుకొచ్చారు.