ప్లాష్ ప్లాష్: వైసీపీలో ఎంట్రీకీ లైన్ క్లియర్ చేసుకున్న టీడీపీ సీనియర్ నేత..!

Monday, July 22nd, 2019, 05:28:37 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.

అయితే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే వలసలు ఆపడానికి టీడీపీ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న పార్టీనీ వీడాలనుకున్న నేతలు మాత్రం అసలు ఆగడంలేదు. అయితే తాజాగా గత కొద్ది రోజుల నుంచి టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న టీడీపీ ఫైర్ బ్రాండ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ మారేందుకు రెడీ అయిపోయాడు. అయితే గతంలో పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పనిచేసినా చంద్రబాబు మంత్రివర్గంలో ఈయనకు స్థానం కల్పించకపోవడం, చివరలో ఏదో నామమాత్రంగా టీటీడీ బోర్డ్ మెంబర్‌గా స్థానం కల్పించాడు. అయితే పార్టీలో తనకు మంచి పేరు ఉన్నా చంద్రబాబు తనను పక్కకి పెట్టాడని ముందు నుంచే ఈయన కాస్త అసంతృప్తితో ఉన్నాడు. అయితే ఈ సారి ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇక పార్టీలో ఉంటే తన రాజకీయ మనుగుడ కష్టమే అని భావించిన ఈయన వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఇప్పటికే చాలా వరకు లైన్ క్లియర్ చేసుకున్నాడు. అయితే త్వరలోనే ఈయన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారని రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నాయి.