హాట్ టాపిక్: జగన్ కేసుల గురించి మాట్లాడటానికే ఢిల్లీ వెళ్తున్నారా?

Thursday, February 13th, 2020, 03:15:46 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని యనమల అన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని సంచలన ఆరోపణలు చేసారు. అయితే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ మొండిచేయి చూపించిందని తెలిపారు. బడ్జెట్ లో ఉంటేనే నిధులు విడుదల చేసే అధికారం ఉంటుందని యనమల గుర్తు చేసారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఫై యనమల సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు ఏడు సార్లు ఢిల్లీ కి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసారని చెప్పుకొచ్చారు. ఆ వివరాలని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని అన్నారు. అయితే కేసులకు సంబంధించిన విషయాల పైనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ కి వెళ్తున్నారా? అని నిలదీశారు. అయితే జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ కి వెళ్లినా కేంద్రం నుండి ఒక్క పైసా కూడా అదనంగా వచ్చే దాఖలాలు లేవని అన్నారు.

అయితే యనమల మరొకసారి సెలెక్ట్ కమిటీ వివాదం ఫై నోరు విప్పారు. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని తెలిపారు. అయితే ప్రజలకు ఉపయోగపడే బిల్లుల్ని తీసుకొస్తే మండలిలో ఎందుకు అడ్డుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపితే ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని, అసెంబ్లీ నుండి వచ్చిన ఏ బిల్లుని తాము అడ్డుకోలేదని తెలిపారు.