బ్రేకింగ్ న్యూస్ : కోడెలది ఆత్మహత్య కాదు..టీడీపీ సోషల్ మీడియా సంచలనం!

Wednesday, September 18th, 2019, 12:12:46 PM IST

ఇప్పుడు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మ హత్యా ఘటన ఏపీ రాజకీయ వర్గాలను స్తంభింపచేసింది. కారణాలు ఏవైనా సరే ఇప్పుడు ఆయన లేరు,కానీ దీనికి సంబంధించి మాత్రం ఎప్పటిలానే అటు తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీల నడుమ రచ్చ నడుస్తూనే ఉంది.

వైసీపీ పార్టీ వారేమో తెలుగుదేశం పార్టీ వల్లనే ఆయన మరణించారని టీడీపీ వాళ్లేమో వైసీపీ ప్రభుత్వమే ఆయన ఆత్మ హత్యకు పాల్పడేలా చేసిందని అంటున్నారు.అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా ఒక సంచలనం వీడియోను విడుదల చేసి కోడెలది ఆత్మ హత్య కాదు ఈ కొత్త ప్రభుత్వం చే కాబడిన హత్య అంటూ వీడియోను పెట్టి కూలంకషంగా వివరణ ఇచ్చారు.

“కోడెల… రూపాయి డాక్టరుగా ప్రజలు అభిమానించిన వైద్యుడు. రాజకీయనాయకుడిగా పల్నాటి పులిగా పిలువబడ్డ ధీశాలి. అలాంటి వ్యక్తి బలవన్మరణం పొందారు. కాదు కాదు.. కక్షగట్టిన ప్రభుత్వం మానసికంగా, ఆర్థికంగా వేధించి, వెంటాడి, అవమానించి, భయపెట్టి ఆత్మహత్యకు ఉసిగొల్పింది.” అని దానికి ఇంకా కంటిన్యు ఇస్తూ వీడియోలో పొందుపరిచారు.మొత్తానికి ఈ ఇష్యూ ఎక్కడ ఆగుతుందో చూడాలి.ఒకసారి ఆ వీడియోలో ఏముందో ఈ కింద మీరు కూడా వీక్షించండి.