డోంట్ మిస్ : కోడెలపై ఎలా కుట్ర చేసారో కళ్ళకు కట్టినట్టు చూపిన టీడీపీ!

Thursday, September 19th, 2019, 12:43:29 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలు మొత్తం టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ కోడెల శివ ప్రసాదరావు గారి మరణ వార్త చుట్టూతానే తిరుగుతున్నాయి.మొత్తానికి ఈ వార్తను కూడా టీడీపీ మరియు వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోకుండా మానడం లేదు.అయితే కోడెల ఆత్మహత్యకు ముమ్మాటికీ జగన్ ప్రభుత్వమే కారణమని బలంగా చెప్తున్నారు.అందుకు సంబంధించి కూడా కొన్ని నమ్మదగిన విషయాలనే తమ సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు.

అయితే కోడెల వైసీపీ ప్రభుత్వం వలనే చనిపోయారు అని చెప్పడానికి ఒక సంచలన వీడియోను వదిలారు. అది చూస్తే నిజగంగానే కోడెల వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే చనిపోయారా అన్న అనుమానం తప్పకుండ ప్రతీ ఒక్కరికి కలుగుతుంది.ఆయన్ను ఎన్ని కేసులు పెట్టి కావాలని ఇబ్బందులు పెట్టారో ఆయన్ని ఆయన కుటుంబాన్ని కావాలనే కుట్ర చేసి అసలు సరైన ఆధారాలు లేని కేసులు అందులోను కొంతమంది తప్పుడు వ్యక్తులతో కేసులు పెట్టించి మానసికంగా ఆయన్ను కుంగదీసి ఆత్మ హత్య వరకు తీసుకెళ్లారో చూపించారు.ఒక సారి ఈ కిందున్న ఆ సంచలన వీడియోను మీరు కూడా వీక్షించండి.