రేపే టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం…

Monday, August 12th, 2019, 11:54:43 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమిని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక ప్రణాళికలను రూపొందించుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమేరకు ఆంధ్రప్రదేశ్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కాగా విజయవాడలో రేపు రాష్ట్రస్థాయి సమావేశం కారపనున్నారు టీడీపీ నేతలు. రేపటి సమావేశం కొరకు టీడీపీ పార్టీలోని ముఖ్యనేతలందరితో చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు తమ తమ నేతలతో చాలా కీలకమైన విషయాలను చర్చించారని, రేపు జరగబోయే సమావేశం కూడా చర్చలు జరిపారని సమాచారం.

ఈ కాన్ఫిరెన్స్ లో ముఖ్యనేతలందరితో మాట్లాడిన చంద్రబాబు నాయుడు రేపు రెండోసారి రాష్ట్రస్థాయి సమావేశం జరుపుకుంటున్నామని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి కూడా టీడీపీ శ్రేణులపై దాడులు చాలా పెరిగాయని, చివరికి కొన్ని వర్గాల వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా టీడీపీ వారిపై భౌతికంగా మాత్రమే దాడులు జరపకుండా వారికి సంబందించిన ఆర్థిక మూలలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నారని చంద్రబాబు అన్నాడు. కాగా ఈమేరకు రేపు జరగనున్న రాష్ట్ర స్థాయి సమావేశానికి తమ నేతలందరూ కూడా సమగ్రమైన వివరాలతో రావాలని చంద్రబాబు నేతలందరినీ కూడా కోరారు.