తేదేపా రాష్ట్ర కార్యాల‌యం కూల్చేయాల్సిందే!

Thursday, July 11th, 2019, 06:40:32 PM IST

తెలుగు దేశం పార్టీ (తేదేపా) రాష్ట్ర కార్యాల‌యం కూల్చేయాల్సిందేన‌ని వైకాపా డిమాండ్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. వాస్త‌వానికి తేదేపాకు ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన కార్యాల‌యం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలన్నింటిని గుంటూరు పార్టీ కార్యాలయం వేదికగా నిర్వహిస్తోంది. అయితే ఆ కార్యాలయం అక్రమ కట్టడమంటూ వైసీపీ నేతలు గుంటూరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయ‌డంతో గ‌డ‌బిడ మొద‌లైంది.

తేదేపా కార్యాల‌యాన్ని క‌ట్టిందే ఆక్ర‌మించిన స్థ‌లంలో. టీడీపీ రాష్ట్ర కార్యాలయం కార్పొరేషన్ సంస్థలో నిర్మించారని అది అక్రమ కట్టడమంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. దాన్ని కూల్చివేయాలని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు నగర పాలక సంస్థ అధికారులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన సమయంలో తేదేపా కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరుగుతోంది. అయితే తేదేపాని నామ‌రూపాల్లేకుండా చేయ‌డ‌మే ధ్యేయంగా సాగుతున్న ఈ వింతాట‌కంపై ఏపీ వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తేదేపా అక్ర‌మ‌క‌ట్ట‌డాల‌న్నిటిపైనా వైకాపా దృష్టి సారించి వేట మొద‌లు పెట్టింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ర‌క‌ట్ట ఇంటిపైనా వైకాపా నేత‌ల ఆరోప‌ణ‌లు తెలిసిందే.