షాకింగ్ న్యూస్: వంశీ ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన టీడీపీ…కారణం ఏంటో తెలుసా?

Friday, November 15th, 2019, 06:07:40 PM IST

వల్లభనేని వంశీ చంద్రబాబు కి ఇటీవలే తన రాజీనామా లేఖని పంపారు. అయితే దానికి తగు కారణాలు తెలుసుకొని బుజ్జగించే పనిని పెట్టుకున్నారు చంద్రబాబు. అయితే అవేమి ఫలించలేదు. కాకపోతే నిన్న చంద్రబాబు తలపెట్టిన దీక్షని ఉద్దేశించి వల్లభనేని వంశీ పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ నుండి పార్టీలోని పలువురు నేతలను టార్గెట్ గా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఈ క్రమం లో చంద్రబాబు పై, పార్టీ పై విమర్శలు చేయడం తో పార్టీ నుండి వల్లభనేని ని సస్పెండ్ చేయడం జరిగింది.

అయితే ఈ విషయం లో ఒక పక్క చంద్రబాబు ని విమర్శిస్తూనే మరోపక్క వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మద్దతు గా నిలిచారు. సీఎం జగన్ కి భేషరతుగా మద్దతు ఇస్తానని, జగన్ చేస్తున్న ప్రజా కార్యక్రమాలకు, అండగా ఉంటానని తెలపడం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ నుండి పార్టీ మారుతున్నా నేతల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మహా అయితే నాలుగు రోజులు జైల్లో ఉంటాం, అంతకంటే అధికార పార్టీ ఎం చేయలేదని అన్నారు.