అసెంబ్లీలో ముభావంగా ఉన్న చంద్రబాబు,బాలకృష్ణ.!

Wednesday, June 12th, 2019, 03:52:37 PM IST

2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఈరోజు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.అలాగే గెలుపొందిన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు సహా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కూడా మరో సారి ప్రమాణ స్వీకారం చేసారు.అయితే గత ఎన్నికల్లో అంటే మొత్తం అసెంబ్లీ పసుపు మయం అయ్యిపోయింది కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ వల్ల తెలుగుదేశం క్యాడర్ అంతా ఒక పక్కకు వెళ్ళిపోయింది.కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందడం వల్ల వారి కళ్ళల్లో కానీ ముఖంలో కానీ ఎక్కడా ఆనందం కనిపించలేదు.

ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే పనిలో ఓ చోట కూర్చున్న చంద్రబాబు,అచ్చెన్నాయుడు,గంటా అలాగే బాలకృష్ణ ఎలా ఎవ్వరి మొహాల్లో చూసినా సరే ఏదో ఒక రకమైన బాధ సుస్పష్టంగా కనిపిస్తుంది.దీన్ని బట్టి వారంతా తెలుగుదేశం పార్టీ ఘోర వైఫల్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అర్థమవుతుందని ఈ ఫోటోలు చూసిన వారు అంటున్నారు.మరి రానున్న రోజుల్లో అయినా సరే ఈ 23 మంది ఆ 151 మందిని ఎంతవరకు ఎదుర్కొంటారో చూడాలి.