ఇక ఏపీ రాజకీయాల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతే.!

Monday, June 10th, 2019, 06:38:21 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటే దానికి చాలా దారుణంగా మారిపోయేలా ఉందనే సమాధానమే వస్తుంది.ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లో ఇంత దారుణమైన పరాజయాన్ని పొందుతారని వారు కలలో కూడా అనుకోని ఉండి ఉండరు.దీనితో ఒక్కసారిగా యావత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా డీలా పడిపోయారు.

ఒక పక్క రానున్న ఐదేళ్లలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలి అని పెద్దలు అనుకుంటుంటే పార్టీలోని అసమ్మతి నేతలు మరియు జుంపింగ్ జిలానీలు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.త్వరలోనే తెలుగుదేశం పార్టీలోని కీలకమైన వికెట్లు అన్ని పడిపోవడం ఖాయమని ఇప్పటికే చాలా మంది పెద్ద పెద్ద నేతలు అలాగే ప్రముఖ కుటుంబానికి చెందిన వారు బీజేపీ పార్టీతో టచ్ లో ఉన్నారని ఏ సమయంలో అయినా సరే వీరంతా తెలుగుదేశం పార్టీను వీడి కాషాయ జెండా కప్పుకోడం ఖాయమని తెలుస్తుంది.ఇదే కానీ కొనసాగినట్టయితే ఇక రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమని ఇతర పార్టీల నేతలు అంటున్నారు.