నందిగామలో సైకిల్ గెలుపు

Tuesday, September 16th, 2014, 11:21:57 AM IST


ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా నందిగామ అసెంబ్లీ స్తానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. నందిగామ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి తంగిరాల సౌమ్య 74,690 ఓట్ల తేడాతో విజయం సాధించింది. తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధిపై బోడపాటి బాబురావు పై భారీ మెజారిటీతో గెలుపొందటం సంతోషంగా ఉన్నదని సౌమ్య గెలిచిన అనంతరం పేర్కొంది. తన తండ్రి బాటలోనే నడుస్తానని ఆమె తెలిపింది.