పల్నాడు విషయం లో రెండు పార్టీలు తప్పిదాలు చేస్తున్నాయా?

Wednesday, September 11th, 2019, 07:24:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు అని ప్రకటించిన విషయం అందరికి తెల్సిందే. పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పటికీ ఎలాగైనా జరిపి తీరుతాం అంటున్నాయి. అరెస్టులు చేస్తే ధర్నాలు చేస్తాం అని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం లో తమ కార్యకర్తలని ఇబ్బందులకు గురి చేసినందుకు గాను వైసీపీ ప్రభుత్వ నేతలు కూడా చలో ఆత్మకూరు ప్రకటించారు. కౌంటర్ ప్రక్రియగా అత్థపి నేతలు దీనిని అభివర్ణిస్తున్నా, అసలు ఈ రాజకీయానికి కారణం ఏమిటని పలువురు పెదవి విరుస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ గడిచిన ఎన్నికలలో దారుణంగా ఓటమిని మూట కట్టుకుంది. మరో పక్క జగన్ 100 రోజుల పాలన పై పూర్తిగా విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. ప్రజల తరపున ఒక పక్క పోరాడుతూనే వున్నా ఇలాంటి చర్యలు మంచివి కావు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి అధికారం లో ఉండి , వైసీపీ ఇలాంటి చర్యలకు దిగడం కూడా ప్రభుత్వ పని తీరు పై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసిన, నిరసన చేసిన మాములే, కానీ అధికార పార్టీ చేయడం చాల వింతగా వుంది అంటూ పలువురి అభిప్రాయం. ఈ చర్యలకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని డీఎస్పీ అన్నారు.