టీచర్ కాదు కీచకుడు .. స్కూల్ టీచర్ లని వీడియో తీస్తూ

Friday, September 30th, 2016, 03:13:20 PM IST

boy
స్కూళ్ళు , కాలేజీ లకి మినిమం గౌరవం , విలువలు లేకుండా పోతున్న వేళ ఉపాధ్యాయుల మీద గౌరవం కూడా పోయే సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. విద్యార్ధులని అద్భుతంగా తయారు చేసి భావి తరాలకి అందించాల్సిన ఒక ఉపాధ్యాయుడు కీచాకుడుగా మారాడు. సహచర ఉపాధ్యాయురాళ్లతో పాటు 10 తరగతి విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలోని జగదేవ్‌పూర్‌ ఆదర్శ పాఠశాల ఉంది. మహిళా టీచర్ ల దిన చర్య ని సెల్ ఫోన్ లో రహస్యంగా వీడియో చిత్రీకరించి తనదగ్గర దాచుకున్నాడు. వారు భోజనం చేస్తున్నప్పుడూ, ఆవరణ లో తిరుగుతున్నప్పుడు, స్టాఫ్ రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు అతను. అతను చేసే అకృత్యాలు భరించలేక 11 మంది టీచర్లు ప్రిన్సిపాల్ కి లోఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు కూడా. దీంతో ఆ కీచకుడు ప్రిన్సిపాల్ ని చంపుతా అంటూ బెదిరించాడు. అతడు విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఆన్‌చేసి నీలి చిత్రాలు చూపిస్తున్నాడని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. పదో తరగతి విద్యార్థినుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.