చెన్నై టెస్ట్: ముగిసిన ఇండియా తొలి ఇన్నింగ్స్…337 పరుగులకు ఆలౌట్

Monday, February 8th, 2021, 11:28:36 AM IST

చెన్నై టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా తన తోలి ఇన్నింగ్స్ ను ముగించింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 257 పరుగులు చేసి ఆరు వికెట్ లను కొలోయింది టీమ్ ఇండియా.అయితే పర్యాటక జట్టు ఇంగ్లాండ్ 578 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. అయితే టీం ఇండియా ఎట్టకేలకు 337 పరుగులకు ఆలౌట్ అవ్వడం తో అంతా కూడా ఇక గెలుపు కష్టం అని భావిస్తున్నారు. 337 పరుగులకు కుప్పకూలడంతో ఫాలో ఆన్ లో పడింది భారత్. నాల్గవ రోజు భారత్ 80 పరుగులను చేసి 4 వికెట్ లను కోల్పోవడం జరుగింది. వాషింగ్టన్ సుందర్ (85 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా, ఆశ్విన్ 31 పరుగులు చేసి చక్కటి సహాయ అందించారు. అయితే ఇంకా 241 పరుగులు భారత్ చేయాల్సి ఉంది. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చక్కగా రాణిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.