చెలరేగిన ఇంగ్లాండ్ బౌలర్లు.. 145 పరుగులకే భారత్ ఆలౌట్..!

Thursday, February 25th, 2021, 05:17:50 PM IST

మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు తొలి రోజు 112 పరుగులకే ఆలౌట్‌ చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఈ రోజు ఓవర్ నైట్ స్కోర్ 99/3 తో ఆట కొనసాగించిన భారత్ మరో 46 పరుగులకే మిగతా 7 వికెట్లు కోల్పోయి ఆలౌటయ్యంది.

అయితే భారత బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్ శర్మ 66 పరుగులతో రాణించగా, కోహ్లీ 27 పరుగులు, అశ్విన్ 17 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లాంగ్ బౌలర్లలో కెప్టెన్ జో రూట్ 5 వికెట్లు తీయగా, లీచ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను కోలుకోని దెబ్బతీశారు. దీంతో భారత్ 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఇండియాకు తొలి ఇన్సింగ్స్ లో 33 పరుగుల స్వల్ఫ అధిక్యత లభించింది.