భారత్ ఘనవిజయం – సెమీస్ లోకి చేరిన భారత జట్టు

Tuesday, July 2nd, 2019, 11:26:29 PM IST

ఐసీసీ ప్రపంచకప్‌ సీజన్ లో భాగంగా నేడు బర్మింగ్‌‌హామ్ వేదికగా టీమిండియా మరియు బంగ్లాదేశ్ తో జరిగిన భీకరపోరులో టీమిండియా జట్టు ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఈ విజయంతో భారత జట్టు సెమిస్ లో చోటు సుస్థిరం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ కి కి దిగిన భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ఓపెనర్ రోహిత్ శర్మ శతకాన్ని సాధించాడు. అంతేకాకుండా రోహిత్ సాధించిన ఈ శతకంతో ప్రపంచకప్ సీజన్లలో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు కూడా బాగానే రాణించారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ దారుణంగా విఫలమైందని చెప్పాలి. 48 ఓవర్లలో 286 పరుగులకే బంగ్లాదేశ్ ఆటగాళ్లు అందరు కూడా అవుట్ అయ్యారు. దీంతో 28 పరుగుల తేడాతో టీమిండియా జట్టు విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో షకీబ్ 66, సైఫుద్దీన్ 51, రహ్మన్ 36 పరుగులు చేశారు. ఇండియా బౌలింగ్‌లో బుమ్రా 4, హార్థిక్ 3, భువనేశ్వర్, షమీ, చాహల్ తలో వికెట్ తీశారు.