మొదట్లోనే టీమిండియాకు దెబ్బ.. టార్గెట్ 245

Sunday, September 2nd, 2018, 06:53:32 PM IST

ఇంగ్లాండ్ తో రెండు టెస్టుల ఓటమి తరువాత మూడవ టెస్ట్ లో పుంజుకున్న టీమిండియా నాలుగవ టెస్ట్ లో కూడా విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదికూడా భారత బ్యాట్స్ మెన్లు కష్టపడితే గాని సిరీస్ గెలిచే అవకాశాలు ఉండవు. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో 271పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బట్లర్ ఒంటరి పోరాటం(69) చేశాడు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4 కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లాండ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. షమీ తో పాటు ఇషాంత్ (2 వికెట్లు), బుమ్రా అశ్విన్ లు చెరో వికెట్ తీయడంతో భారత్ టార్గెట్ తక్కువయిందనే చెప్పాలి.

ఇకపోతే నాలుగవరోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా ఊహించని విధంగా 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే గట్టి దెబ్బ పడింది. రాహుల్ డకౌట్ కాగా మరికొద్ది సేపటికే ఫామ్ లో ఉన్న పుజారా ఓపెనర్ ధావన్ అవుటయ్యారు. ఇక ప్రస్తుతం కోహ్లీ – రహానే క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 199 పరుగులు చేయాలి. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లకు పిచ్ బాగా అనుకూలిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి మిగిలిన బ్యాట్స్ మెన్లు బ్రిటిష్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments