టీజర్ టాక్ : గీత గోవిందం – నేను డీసెంట్ అంటున్న గోవిందం!

Monday, July 23rd, 2018, 01:43:56 PM IST

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్స్ కొట్టిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత వచ్చిన ఏ మంత్రం వేశావ్ చిత్రంతో కొంత నిరాశ పరిచాడు. ఇక ప్రస్తుతం అయన హీరోగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం గీత గోవిందం. చలో ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత కాగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలె అనే పాట యూట్యూబ్ లో మంచి హిట్స్ సాధించింది. కాగా నేడు చిత్ర యూనిట్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసింది. టీజర్ లో విజయ్ కొత్తగా కనపడుతున్నాడు. టీజర్ ని బట్టి చూస్తే సినిమా కొంత ఎంటెర్టైనింగా కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

ఇక బ్లాక్ అండ్ వైట్ సీన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఎన్నెన్నో జన్మల బంధం సాంగ్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే విడుదలయిన పాటతో మంచి క్రేజ్ సంపాదించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలయిన ఈ టీజర్ తో దానిని మరింత పెంచిందని చెప్పాలి. కొన్నాళ్ల నుండి ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పరశురామ్ ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక బన్నీ వాసు ఇదివరకటి చిత్రం నా పేరు సూర్య ప్లాప్ అవడంతో ఆయనకు కూడా ఈ సినిమా హిట్ అవడం చాలా అవసరమనే చెప్పాలి. త్వరలో ఆడియో వేడుక జరుపుకోనున్న ఈ సినిమా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది….

  •  
  •  
  •  
  •  

Comments