టీజర్ టాక్ : రాజుగాడు ( వీడు పెద్ద కేటుగాడు )

Sunday, March 18th, 2018, 02:08:12 PM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మిస్తున్న కొత్త సినిమా రాజుగాడు. మనసుకు నచ్చింది ఫేమ్ అమైరా దస్తూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్దికాలంగా వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేశారు. ఇందులో రాజ్ తరుణ్ క్లిప్టోమేనియా అనే ఒక వింత వ్యాధితో బాధపతున్న వ్యక్తిగా కనపడనున్నాడు.

ఈ వ్యాధి లక్షణం ప్రకారం అతను కనిపించే వస్తువులను దొంగిలిస్తుంటాడు. టీజర్ లో రాజ్ తరుణ్ పాత్ర ఇలా ఉంటుందని చెప్పేసారు. అలానే ఇందులో రాజేంద్ర ప్రసాద్, సితార ఆయనకు తల్లి తండ్రులుగా నటించారు. టీజర్ ని బట్టి చూస్తే సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. చివర్లో రాజ్ తరుణ్, తండ్రి రాజేంద్ర ప్రసాద్ పక్కన వున్న పర్సు దొంగిలించబోతుంటే, ఒరేయ్ అది నీ పర్సేరా అని చెప్పే డైలాగ్ ఫన్నీగా వుంది. కాగా వేసవి కానుకగా ఈ సినిమా మే 11 న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది….