టీజర్ టాక్ : ‘టాక్సీ వాలా’

Thursday, April 19th, 2018, 01:07:25 AM IST


పెళ్లి చూపులు సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించిన విజయ దేవరకొండ, తన తదుపరి చిత్రాల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా టాక్సీ వాలా. ఇటీవల విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. కాగా నేడు సినిమా యూనిట్ టీజర్ ని విడుదల చేసింది. ప్రియాంక జ్వల్కర్‌, మాళవిక నాయర్‌ కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకుడు.

యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్ ను విజయ్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత నా నుంచి వస్తోన్న న్యూఏజ్‌ సినిమా ఇది. నూతన దర్శకులు, నూతన కథ, నూతన నటీనటులు’ అని ట్వీట్‌ చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ టీజర్‌ను రూపొందించారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. చూడబోతే ఈ సరికొత్త జానర్ సినిమాతో విజయ్ మళ్ళి మంచి హిట్ కొడతాడేమో చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments