టీజర్ : తేజ్ ఐ లవ్యూ.. వాటే రొమాంటిక్ కల!

Tuesday, May 1st, 2018, 12:36:11 PM IST

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల సోషల్ మీడియాలో విడుద‌లైంది. దిదుదల అయిన కొద్ది క్షణాల్లోనే దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హృదయాన్ని కదిలించే క‌వితాత్మ‌క భావ‌న‌లతో సాగే ప్రేమ క‌థాచిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని చిత్ర వర్గం నుండి సమాచారం రాగా, ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌వ‌త‌రం ప్రేమికుడిగా అభిమానులని అలరించనున్నాడు. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు చక్కటి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని నిర్మాత‌లు తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అన్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి కాగా, ప్ర‌స్తుతం పారిస్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్న‌ట్టు చిత్రం టీం దేఆరా అందిన స‌మాచారం . ఈ రోజు మేడే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ నుఇ యుట్యుబ్ లో విడుద‌ల చేశారు. 38 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ సినిమాపై ఓ మంచి రొమాంటిక్ హావభావాలను పెంచుతుంది. చూస్తూ చూస్తూనే వీక్షకుల మోహంలో చిన్నపాటి చిరునవ్వు తెప్పించేలా ఆకట్టుకుంటుంది. ఈ నెల‌లోనే మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్‌. మ‌రి తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Comments