ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన తేజ ?

Wednesday, March 7th, 2018, 02:22:22 PM IST

మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కే సినిమా ఈ నెల 29న లాంఛనంగా మొదలు కానున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ వయసులో ఉన్నప్పటి పాత్రను యువ నటుడు శర్వానంద్ నటిస్తాడని తెగ ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పై స్పందించిన తేజ .. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ నటిస్తున్నట్టు వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని చెప్పేసాడు. దాంతో పాటు ఇందులో బాలకృష్ణ ఏకంగా 72 గెటప్పుల్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు తేజ. ఈ నెల 29 న హైద్రాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియో లో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.