నాగార్జున కోసం సన్నాహాలు చేస్తున్న తేజ ?

Tuesday, May 1st, 2018, 12:50:52 AM IST


నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన తేజ వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ చేసేందుకు రెడీ అయ్యాడు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టకముందే తేజ తప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. దాంతో పాటు అటు వెంకటేష్ తో కూడా ఆటా నాదే వేట నాదే సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేసాడు. ఇప్పుడు ఆ సినిమా కూడా చేజారిందని వార్తలు వస్తున్నాయి. దాంతో తేజ నెక్స్ట్ సినిమా నాగార్జునతో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. తన దగ్గర ఓ మంచి ఫ్యామిలి స్టోరీ ఉందట ..ఆ కథ నాగార్జునకు బాగుంటుందని భావించి ఆయనకు చెప్పే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం నాగార్జున ఆఫీసర్ సినిమాలో నటిస్తున్నాడు. ముంబై లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పూర్తీ కావొచ్చింది. దాంతో పాటు నానితో ఓ మల్టి స్టారర్ చేస్తున్నాడు. ఒకవేళ తేజ కథ నచ్చితే నాగ్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments