తేజ నెక్స్ట్ సినిమా సెట్ అయినట్టేనా ?

Thursday, May 3rd, 2018, 10:03:52 AM IST

అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కే సినిమా నుండి బయటకు వచ్చాడు తేజ. ఎందుకు వచ్చాడు .. కారణాలు ఏమిటి అన్న విషయం పక్కన పెడితే, తేజ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అయన వెంకటేష్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఆటా నాదే వేటా నాదే పేరుతొ తెరకెక్కనున్న ఆ సినిమాకు మధ్యలోనే బ్రేక్ పడింది. దాంతో పాటు మళ్ళీ రానాతో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడట .. కానీ రానా వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఇప్పుడు కుదరదని చెప్పడంతో ప్రస్తుతం తేజ ఫోకస్ నాగార్జున పై పడింది. ఇప్పటికే నాగార్జునతో కథా చర్చలు కూడా జరిపినట్టు టాక్ . కథ నచ్చడంతో నాగార్జున కూడా ఓకే చెప్పాడని సమాచారం. ప్రస్తుతం నాగార్జున వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాతో పాటు నాని తో కలిసి ఓ మల్టి స్టారర్ సినిమాలో చేస్తున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్న తేజ నెక్స్ట్ సినిమాను స్టార్ హీరోతో పట్టేసాడు. సో త్వరలోనే దీనికి సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments