వెంకీ హీరోయిన్ కోసం దర్శకుడి అన్వేషణ ?

Wednesday, January 24th, 2018, 04:16:15 PM IST

గురి సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమాకు సన్నాహాలు మొదలైన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేట నాదే అనే పేరుతొ తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది. ఇందులో యువ హీరో నారా రోహిత్ కూడా నటిస్తున్నట్టు టాక్. ఫ్యామిలి థ్రిల్లర్ కథగా తెరకెక్కే ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ ని ప్రవేశ పట్టాలని చూస్తున్నాడట తేజ. సీనియర్ హీరో అయినా వెంకటేష్ కోసం కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది మరి.