బిగ్ బాస్ 2పై తేజస్వి షాకింగ్ కామెంట్స్!

Tuesday, July 24th, 2018, 03:02:33 AM IST

నాని హోస్టింగ్ లో బిగ్ బాస్ 2 షో చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ కు వచ్చేసరికి షో పై వివిధరకాల కామెంట్స్ వస్తుండడం కూడా దుమారాన్ని రేపుతోంది. ఇకపోతే
రీసెంట్ గా ఎలిమినేటైనా తేజస్వి మాదివాడ ఎవరు ఊహించని విధంగా పలు వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. హౌస్ లో కేవలం గంటసేపు ఉన్నదీ మాత్రమే చూపిస్తారని మిగతా సమయంలో ఎలా ఉన్నదనే దాని గురించి చూపించారని అయితే తన గురించి చూపించిందంతా అబద్దామన్నట్లు తేజస్వి తెలుపడం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

మెయిన్ గా కౌశల్ విషయంలో నా తప్పేమి లేదు. అతనితో గొడవపడటానికి కారణం వేరే అమ్మాయిపై చేయి వేస్తె నేను అడిగాను. అందుకే నన్ను కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసింది. హౌస్ లో అతని ప్రవర్తన గురించి తెలిస్తే ఎవ్వరైనా బయటకు పంపిస్తారు. కేవలం కొన్ని సార్లు అరిచినదాన్నే పదే పదే చూపించారు. అది కరెక్ట్ కాదని 24 గంటలు షో ప్రసారం చేస్తే మీ కౌశల్ ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. నేను ఒక్క బూతు అన్నందుకు వంద అంటున్నారు. అలా అయితే మీకు నాకు తేడా ఏమిటని తేజస్వి నెటిజన్స్ కు ఆన్సర్ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments