న్యూ ల‌వ్‌ : తేజ్ పార్టీ మార్చాడా?

Wednesday, May 9th, 2018, 02:12:19 AM IST

`తేజ్ ఐ ల‌వ్ యు` సినిమాతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఈ చిత్రం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ క‌థానాయిక‌. ఇప్ప‌టికే టైటిల్‌ని ఆవిష్క‌రించి, ఫస్ట్‌లుక్‌ని ప‌రిచ‌యం చేశారు. తేజ్ – అనుప‌మ జోడీ ఎంతో ముచ్చ‌ట‌గా ఉంద‌న్న ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అదంతా స‌రే.. తేజ్ వెండితెర ప్రేమ‌క‌థ‌ను రియ‌ల్ లైఫ్‌కి అప్ల‌య్ చేశాడంటూ ఇప్ప‌టికే పుకార్లు షికారు చేస్తున్నాయి.

అత‌డు ఇదివ‌ర‌కూ రెజీనాతో ల‌వ్వాయ‌ణం సాగించాడు. ఆ ఇద్ద‌రూ ఓ చిత్రంలో జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర‌వాత గొడ‌వ‌ల వ‌ల్ల‌ బ్రేక‌ప్ అవ్వ‌డం రెజీన దానిపై చాలా క‌ల‌త చెంద‌డం తెలిసిందే. ఇప్పుడు అనుప‌మ‌తో తేజ్ ల‌వ్వాయ‌ణం సాగుతోంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఇద్ద‌రూ ఏకాంతంలో క‌లుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నార‌న్న కొత్త ప్ర‌చారం మొద‌లైంది. ఇప్ప‌టికే ఈ కాంబో ఆన్ లొకేష‌న్ ఎంతో స్నేహితులు అయిపోయార‌ట‌. ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేసి నిర్మాణానంత‌ర ప‌నుల్లోకి వెళ్లేందుకు స‌న్నాహాలు సాగుతున్న వేళ‌.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బంధం బ‌ల‌ప‌డింద‌న్న వార్తా బ‌య‌టికి వ‌చ్చింది. మొత్తానికి తేజ్‌తో ల‌వ్‌లో అనుప‌మ‌! అన్న‌ది డిక్లేర్ అయిన‌ట్టే!

  •  
  •  
  •  
  •  

Comments