తెలుగు రాష్ట్రాల లాక్ డౌన్.. నగదు, రేషన్ ఇంటికే..!

Monday, March 23rd, 2020, 11:40:59 PM IST

రోజు రోజుకు కరోనా పెరుగుతున్న నేపధ్యంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే లాక్‌డౌన్ నేపధ్యంలో రోజు వారి కూలీలు, పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రేషన్ కార్డుపై ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు.

అయితే ప్రస్తుతానికి బియ్యం సరఫరా కస్త కష్టతరంగా కనిపిస్తుండడంతో ముందుగా నగదు పంపిణీ చేయాలని భావిస్తుంది. తెలంగాణలో రేషన్ కార్డ్ కలిగిన కుటుంబానికి 1500 రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా, ఏపీలో 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే ఈ నగదును నేరుగా అర్హుల చేతికే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో సేకరించిన బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయాలని భావించిన ప్రస్తుతం అందులో ఎన్ని పనిచేస్తున్నాయన్నది తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. కరోనా నేపథ్యంలో బ్యాంకుల్లో సిబ్బందిని కూడా తగ్గించడంతో ఈ సమయంలో నగదు బ్యాంకులలో జమ చేస్తే లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు వెళితే మరింత ఇబ్బంది ఏర్పడుతుందని భావించిన ప్రభుత్వాలు నగదును నేరుగా అందించేందుకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.